Sunday 24 May 2015

పనికి రాని మంత్రాలూ --- హిందూ మతం



హిందూ మతం భావవాద, మంత్రవాదాల కలయిక. భావవాదం అంటే ఉన్నది లేదని లేనిది ఏదో ఉంది అని నమ్మడం నమ్మించడం. వీళ్లు అస్తిత్వం ఉండి కనపడే వాటిని నమ్మడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కృష్ణ అనే వాడు అమ్మాయిలు స్నానం చేస్తుంటే వాళ్ల దుస్తులు ఎత్తు కెల్తాడు. షీ టీమ్స్ ఉంటే బొక్కలో వేసి కుమ్మేసే వాళ్లు లేవు కాబట్టి బతికి పోయాడు. ఈ పురాణాలూ గొప్పవి అని నమ్మే వాళ్ళు , అలాంటి నేరాలను సమర్దించే వారిగా తయారవుతారు. ఇంగితం లేని వాదనలకు దిగుతారు. దాన్లోఏదో పరమార్ధం దాగుంది అని మొదలు పెడతారు. దాన్ని నెత్తికెత్తుకునే క్రమం లో వాళ్ళు దిగాజరతారు. ప్రతిదాన్ని దేవుడిని చేసేయడం భావవాదం. దాన్ని మంత్రాలతో లోబరచుకోవచ్చు, ప్రసన్నం చేసుకోవచ్చు అనేది మంత్రవాదం. వేదాల్లో ఉండేది ఈ భావదారిద్ర్యమే. ఏ దేవుడికి ఎలాంటి హోమం చేయాలి, ఏం మంత్రం చదవాలి, ఎలాంటి హోమ గుండం కట్టాలి ఇదే గోల. వీళ్లకి ఏది పడితే అది దేవుడే. డబ్బులు, చదువు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయు, వరుణ ఇంకా ఏది పడితే అది. వాడు దేవుడు అనడం వాడిని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రాలూ ఉంటాయనడం డబ్బు దండుకోడం దీని ప్రత్యేకత. కప్పల పెళ్లి ఎంత మూడ నమ్మకమో ఈ సరస్వతి దేవి కటాక్షిస్తుంది చదువు వస్తుంది అనేది అంతే మూడ నమ్మకం. అయిన్ స్టీన్, అబ్దుల్ కలాంలు ఏ సరస్వతి పూజ చేయలేదు, బిల్ గేట్స్ ఏ లక్ష్మి పూజ చేయలేదు. మన అందరికి అక్షరాభ్యాసం అనే తంతు మన అందరికి జీవితం లో భాగమై పోయింది కాబట్టి, ఇవి మనకి చిన్నప్పటి నుంచి నూరి పోసారు కాబట్టి, ఏదో చాలా సహజం గా కనబడతాయి. కాని ఒకసారి ఆలోచిస్తే నవ్వొస్తుంది. అది సోమరి పోతులు పని దొంగలు మనకి అంటగట్టిన ఆచారం మంత్రవాద భావజాలం. పనికి రాని మంత్రాలూ చదివి జనం అమాయకత్వాన్ని సొమ్ము చేసు కుంటున్నారు. కామన్సెన్స్ పని చేయని, వెనుక బడ్డ వారిని మన ఇళ్లకి పిలిచి పనికి రాని మంత్రాలూ చదివించి మన కష్టార్జితం దోచి పెట్టడం అవసరమా?

1 comment:

  1. హిందూఇజం(సనాతనధర్మం)అనేది ఒక మతం కాదు ఒకధర్మం మననిత్యజీవితంలో మనం ఆచరించాల్సిన జీవన విధానం, మనకు ఎన్నో మతాలు శాస్త్రాలు వివరించలేని సమాధానాలు చూపంచలేని సమస్యలకు మనకు సమాధానం దొరుకుతుంది....

    ReplyDelete